అసోసియేషన్ పేరుతో అనేక ఆక్రమాలు.. బాధితులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం ప్లంబర్ అండ్ అసోసియేషన్ 107 మంది లీడర్లు,, వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర, రాజు అయిన వీరు అసోసియేషన్ను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ అసోసియేషన్కు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని, ఇందులో అక్రమ లేఅవుట్లు వేసి, పేరుకు ఎలక్ట్రీషియన్ పేరు పెట్టుకొని, అనేక బినామీ పేర్లతో ప్లాట్ ఐదు లేదా పది లక్షలకు అమ్ముకుంటూ అక్రమ సంపాదనకు తెరతీయడం జరిగిందని తెలిపారు. వీరు గతంలో వైసిపి వారిని అడ్డం పెట్టుకొని అప్పటి తాసిల్దార్ తో కలిసి దొంగ పట్టాలను తయారుచేసి అక్రమంగా పునాదులు నిర్మించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అప్పటి ఎమ్మార్వోకి పది లక్షలు లంచం ఇచ్చి వైసిపి ను అడ్డం పెట్టుకొని అనేక ఆక్రమాలు కూడా చేయడం జరిగిందన్నారు. తదుపరి మరి కొంతమంది టీడీపీ లీడర్లు అండతో వారు కూడా డబ్బులు ప్లాట్లు ఇచ్చి టిడిపి కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగిందన్నారు. అందువలన ఈ ఆక్రమాలకు అడ్డుకట్ట వేసి మా కార్మిక సోదరులకు న్యాయం చేయవలసినదిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే. తాజావుద్దీన్, ఎం. కృష్ణమూర్తి, ఎస్. బాబావాలి ఎస్.. లచ్చి, బి. రామసుబ్బయ్య, టి. శ్రీరాములు, ఎస్ మసూద్, కేఎం గౌస్, కె నూరుద్దీన్, ఎస్ నూర్ మొహమ్మద్, ఎం దాదా పీర్, పి వినోద్ తదితరులు పాల్గొన్నారు. (Story : అసోసియేషన్ పేరుతో అనేక ఆక్రమాలు.. బాధితులు)