మాదక ద్రవ్యాల నియంత్రణ పై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/విజయనగరం : సీతం ఇంజనీరింగ్ కళాశాలో జరుగుతున్న కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ (సి ఎ టి సి)లో, మాదక ద్రవ్యాల నియంత్రణ పై అవగాహన సదస్సు జరిగింది. విశాఖపట్నంలోని గ్రీన్ వాలీ పునరావాస కేంద్ర వ్యవస్థాపకురాలు ఉమా రాజ్ ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్.సి.సి క్యాడెట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, “మాదక ద్రవ్యాల వినియోగం నేటి యువతలో తీవ్ర సమస్యగా మారిందని దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయన్నారు.యువత భవిష్యత్తు ఎంతో విలువైనదని అందుకే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని” సూచించారు.ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ తాపస్ మండల్,డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ పల్లవి వర్మ, సత్యా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రామ్మూర్తి,సుబేదార్ మేజర్ అనిల్,మరియు ఇతర ఎన్.సి.సి అధికారి సిబ్బంది, మేజర్ శ్రీనివాసరావు, కెప్టెన్ సత్యవేణి, లెఫ్టినెంట్ కృష్ణ కిషోర్, దినేష్, లక్ష్మి, ప్రశాంత్, సతీష్, సత్యనారాయణ, మహేశ్వరరావు పాల్గొన్నారు.ఈ క్యాంప్‌లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి సుమారు 500 మంది ఎన్.సి.సి క్యాడెట్స్ పాల్గొన్నారు. (Story : మాదక ద్రవ్యాల నియంత్రణ పై అవగాహన సదస్సు)