సీతంలోకరెంట్ ట్రెండ్స్ ఆఫ్ జాబ్స్ ఎన్డ్ ఎక్స్పీరియన్సెస్అంశం పై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో ఉన్న సీతం కళాసాల లోకరంట్ ట్రెండ్స్ ఆఫ్ జాబ్స్ ఎన్డ్ ఎక్స్పీరియన్సెస్” అనే అంశం పై ఉమ్మయ్ హేని ( క్వాలిటీ స్పెషలిస్ట్ , అమెజోన్ మేప్స్ )విద్యార్దులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా ఉమ్మయ్ హేని ( క్వాలిటీ స్పెషలిస్ట్ , అమెజోన్ మేప్స్ ) విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజ్మెంట్ స్టడీస్ కు చెందిన విద్యార్దులకు కూడా టెక్నికల్ విబాగం లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. డేటా విశ్లేషకులు, వ్యాపార విశ్లేషకులు, ఉత్పత్తి, ప్రాజెక్ట్, ఐటీ మేనేజర్ మోదలగు ఎన్నో ఉపాది అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతీ మెనేజ్మెంట్ విద్యార్ది కుడా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే మంచి ఉపాది అవకాశాలు పొందగలరని తెలిపారు. కళాసాల డైరెక్టర్ డా॥ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యార్దులకు వ్యాపారానికి అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాజెక్ట్‌లను నిర్వహించడం వివిధ వ్యాపార సందర్భాలలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను సంస్ద అందిస్తుందన్నారు.సీతం ప్రిన్సిపల్ డా॥ ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ బీబీఏ తరువాత విద్యార్దులకు లాజిస్టిక్స్, ప్రొక్యూర్‌మెంట్ మరియు సప్లై చైన్ కోఆర్డినేషన్ , ప్రపంచ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ఎగుమతి/దిగుమతి కార్యకలాపాలు లేదా అంతర్జాతీయ మార్కెటింగ్ లలో ఉపాది అవకాశాలు పొందవచ్చునన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మెనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డా॥ యస్ వరూధిణీ మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యార్దులలో వ్యాపార నైపుణ్య అభివృద్ది కోసం బిజినెస్ కమ్యూనికేషన్ క్లబ్స్ , రోల్ ప్లేస్ , బిజినెస్ ఏక్టివిటీస్ , పారిశ్రామిక సందర్శనలు వంటి కార్యక్రమాలను కళాసాల నిర్వహిస్తాదన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉపాద్యాయులు, కళాసాల విద్యార్దులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జాతీయ గీతాలాపన ద్వారా ముగిసింది. (Story : సీతంలోకరెంట్ ట్రెండ్స్ ఆఫ్ జాబ్స్ ఎన్డ్ ఎక్స్పీరియన్సెస్అంశం పై అవగాహన సదస్సు)