Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు

న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కొత్తపేటలో గల టీచర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ, భక్తాదుల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం నాల్గవరోజు అమ్మవారు కుష్ముండ దేవి అలంకరణలో భక్తాదుల కు దర్శనం ఇచ్చారు. భక్సాధులకు అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు.పట్టణంలోని సాలే వీధిలో గల పుట్లమాంబ దేవి ఆలయంలో ఆలయ కమిటీ దాతల సహకారంతో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు జరిగాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాద పంపిణీ చేశారు. అమ్మవారు నాల్గవ రోజు మధుర మీనాక్షి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ గిర్రాజు ప్రసాద్, గిర్రాజు నగేష్, కోటమ్ రవి తదితరులు పాల్గొన్నారు.పట్టణములోని శివానగర్, కేశవ నగర్ లలో వెలసిన శ్రీ విజయ చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ, భక్తాదులు, దాతల సహాయ సహకారములతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అమ్మవారు నాల్గవరోజు గౌరీ దేవి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.(Story:అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!