రాష్ట్రస్థాయిలో విశాఖ నగరానికి ప్రథమ స్థానం గా స్వచ్ఛ భాగీదారి అవార్డు
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు స్వీకరణ
స్వచ్ఛ భాగిధారి అవార్డు విశాఖ నగర ప్రజలకు అంకితం
-జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్
న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం : రాష్ట్రస్థాయిలో విశాఖ నగరానికి స్వచ్ఛ భాగిదారిగా ప్రథమ స్థానం అవార్డు దక్కడం , రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును స్వీకరించడం ఆనందదాయకమని, ఈ స్వచ్ఛ భాగిదారీ అవార్డు విశాఖ నగర ప్రజలకు అంకితం చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ విజయవాడ నుండి పేర్కొన్నారు. బుధవారం ఆయన మచిలీపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా రాష్ట్రస్థాయి లో విశాఖ నగరానికి ప్రథమ స్థానంగా స్వచ్ఛ భాగిధారీ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ, విశాఖ నగర మేయర్ ప్రజా ప్రతినిధులు, నగర ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సేవల సహకారంతోనే ఈ స్వచ్ఛ భాగీధారి అవార్డు లభించిందని అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు విశాఖ నగరంలో జరిగిన స్వచ్ఛత స్వభావం – స్వచ్ఛత సంస్కారం అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో పరిశుభ్రత పాటించడంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛత కి భాగిదారీ, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయిమిత్ర సురక్షా శిబిరాలు అనే కార్యక్రమాలను విరివిగా చేపట్టడమైనదని, ఈ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పరిశుభ్రత స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించడంలో విశాఖ నగరానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంగా స్వచ్ఛ భాగిదారీ అవార్డు లభించిందని కమిషనర్ తెలిపారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగిందని, రాష్ట్రస్థాయిలో విశాఖ నగరం స్వచ్ఛభాగీదారి అవార్డు సాధనకు సహకరించిన ప్రజలకు ఈ అవార్డును అంకితం చేయడమైనదని అలాగే అందుకు పూర్తి సహాయ సహకారాలను అందించిన ప్రజాప్రతినిధులు ,ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ,మహిళా సంఘాలు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎన్జీవోలు, విద్యాసంస్థలు, యువత ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలను కమిషనర్ తెలిపారు. (Story : రాష్ట్రస్థాయిలో విశాఖ నగరానికి ప్రథమ స్థానం గా స్వచ్ఛ భాగీదారి అవార్డు)