బలమైన మార్పులతోనే గాంధీజీ ఆశయాలు సాధించుకోగలం
ఖైదీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన
న్యూస్‌తెలుగు/ వినుకొండ : చట్టాల అమలు, శిక్షల విషయంలో బలమైన మార్పులతోనే గాంధీజీ ఆశయలా సాధించుకోగల మని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా ఉన్నప్పుడే మహాత్ముడు కోరుకున్నట్లు నేరాలు లేని సమాజాన్ని సాధించుకోగలమన్నారు. అలానే చట్టం, న్యాయం ద్వారా విధించే శిక్షల అంతిమలక్ష్యం తప్పుచేసిన వారిలో పరివర్తన తీసుకుని రావడమే కావాలని ఆకాంక్షించారు . బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బుధవారం వినుకొండ ఉప కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే గాంధీజీ కోరుకున్నారని తెలిపారు. ఆయన సిద్ధాంతమైన అహింసావాదంతోనే అంతా ముందుకు వెళ్లాలని సూచించారు. వ్యక్తిగతంగా తానైతే మరీ ముఖ్యంగా అత్యాచారాలు, హత్యాచారాల కేసుల్లో చాలా కఠినంగా శిక్షలు ఉండాలన్నారు. గడిచిన అయిదేళ్ల జగన్ పాలన లో రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెద్దసంఖ్యలో పెరిగాయని, ఆ పరిస్థితులు మార్చాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో నేరాలు బాగా తగ్గాయో అక్కడ అమలు చేసిన విధానాలపై దేశ న్యాయవ్యవస్థ కూడా అధ్యయనం చేయాల్సన అవసరం ఉందని సూచించారు ఎమ్మెల్యే జీవీ.
ఘోరమైన తప్పులు చేసినప్పుడు కఠినమైన శిక్షలతోనే సురక్షితమైన సమాజాన్ని నిర్మించుకోగల మని అభిప్రాయ పడ్డారు. అదే విషయంపై ఆలోచించాలని హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూ ర్తులను కోరుతున్నా అన్నారు. అదే సమయంలో ఖైదీల సంక్షేమ దినంగా సందర్భంగా దైవభక్తి ఉన్న ఖైదీల కోసం జైల్లో 3మతాలవారికి ప్రార్థనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. జైల్లో ఇన్వర్టర్ లేదని, దానివల్ల దోమలు పెరిగి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని , అందుకే తానే ఒక ఇన్వర్టర్ పంపిస్తానని అధికారులకు తెలిపారు. దేవాలయాల నిర్మాణానికి కూడా రూ. 10 వేలు సాయం చేస్తానన్నారు ఎమ్మెల్యే జీవీ. అలానే మాజీ ఎమ్మెల్యే మక్కెన, తాను చెరో వాటర్ ఫిల్టర్ పంపిస్తామని మాటిచ్చారు. ఇప్పటికీ మన జైళ్ల వ్యవస్థ అంతా మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని అనుసరించే నడుస్తోంది. ఎవరు ఏ పరిస్థితులు, ఏ కారణంగా జైలుకు వచ్చినా తప్పు చేసిన వారికి ఒక పశ్చాత్తాపం ముఖ్యం అన్నారు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం మరొకటి లేదని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. తప్పు చేశాను అని గుర్తించి ఆ దేవుడిని, ఎదుటి కుటుంబాన్ని ప్రాయశ్చితం అడిగి, జీవితం మళ్లీ ఆ తప్పు చేయకుంటే దేవు డు నిజంగా క్షమిస్తాడన్నారు. మళ్లీ మంచి జీవితాలు ప్రారంభించ గలిగితే జన్మ ధన్యమైనట్లే అన్నారు. ఖైదీలకు మంచి వైద్యసౌకర్యాలు, పోషకాహారం అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అప్పుడప్పు డు బీపీ, షుగర్ టెస్టుల నుంచి కొన్ని వైద్య పరీక్షలకు అనుమతించాలని జైలు అధికారులకు సూచించారు. ఆ వైద్య పరీక్షలు చేస్తున్నారా లేదా అన్నది తెలుసుకుని దగ్గరగా పరిశీలించమని సూచించారు. సత్ప్రవర్తన చాలా అవసరమని, తప్పులు చేసిన సరిదిద్దుకుని శభాష్ అనేలా జీవితంలో ముందుకు వెళ్లాలన్నారు.(Story : బలమైన మార్పులతోనే గాంధీజీ ఆశయాలు సాధించుకోగలం)