విద్యార్థి కి ఆర్ధిక సహాయం అందించిన లక్ష్మన్ బాబు
న్యూస్ తెలుగు /ములుగు : ఏటూరునాగారం మండలలోని బూటారాం గ్రామం కు చెందిన పెద ఆదివాసీ విద్యార్ధి సాత్విక, ఉన్నత చదువులకై ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న, బి ఆర్ ఎస్ ములుగు జిల్లా జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు 10,000/- సహాయం ఆర్థిక చేశారు . ఈ సందర్బంగా లక్ష్మన్ బాబు మాట్లాడుతూ ములుగు జిల్లాలలో పెద విద్యార్థులు, సమస్య ఉంటే తన ద్రుష్టి కి తీసుకో రావాలని, పేదలకు బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుంది అని అన్నారు. డబ్బులు లేక చదువు ను ఆపవద్దని అని అన్నారు. ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు కాకులమర్రి ప్రదీప్ బాబు, కాకులమర్రి భాస్కర్ రావ్, తాడూరి రఘు, తుమ్మ మల్లారెడ్డి, బస పుల్లయ్య, మహమ్మద్ ఖాలీల్, చిప్ప నాగరాజు, కటుకూరి కిరణ్, మెరుగు వెంకటేశ్వర్లు, పార్వతల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : విద్యార్థి కి ఆర్ధిక సహాయం అందించిన లక్ష్మన్ బాబు)