ఆల్ ఇండియా నీట్ లో ఎంబిబిఎస్ సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసిన విశ్వసాయి విద్యార్థులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ విశ్వ సాయి జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం బైపిసి చదివే విద్యార్థులకు తెలంగాణలోని ప్రముఖ విద్యాసంస్థలో అకడమిక్ డైరెక్టర్ మరియు సీనియర్ ఫ్యాకల్టీ అయిన జొరిగే శ్రీనివాస రావు వరంగల్ నుంచి విచ్చేసి నీట్ ర్యాంకులు సాధించేందుకు ఎలా అధ్యయనం చేయాలి అనే అంశంపై మోటివేషన్ లెక్చర్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం విడుదలైన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఈ కళాశాల విద్యార్థులు ఎ. బాబి ఆంటోని, ఎస్డి యాస్మిన్ లను వారి తల్లిదండ్రులను కళాశాల తరఫున సత్కరించడం జరిగింది. అలాగే కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చేందుకు విచ్చేసిన ఈ సభ అధ్యక్షులు జొరిగే శ్రీనివాసరావు ని కళాశాల తరఫున సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొనగా విద్యార్థులను ఉద్దేశించి అధ్యాపకులు మాట్లాడారు. ఈ సీట్లు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపకులను కళాశాల యాజమాన్యం అభినందిస్తూ మా కళాశాలను నమ్మి విద్యార్థులను చేర్చిన తల్లిదండ్రులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని, ఫిజిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ కే రామారావు, శ డి.సుహాసినీ, పోక హనుమంతరావు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ఆల్ ఇండియా నీట్ లో ఎంబిబిఎస్ సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసిన విశ్వసాయి విద్యార్థులు)