లక్ష్మీ చెన్నకేశవ స్వామి శరణ్యవరాత్రుల వేడుకలు
ఈవో వెంకటేశులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఈనెల మూడవ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశులు, అర్చకులు కోనేరా చార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ చక్రధర్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శాశ్వత వంశపారంపర్య ఉభయ దాతలుగా జగ్గా వంశీయులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ధర్మారం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపారు. ఈనెల మూడవ తేదీన రాజరాజేశ్వరి దేవి అలంకారము, నాల్గవ తేదీన మహాలక్ష్మి, ఐదవ తేదీన లక్ష్మీనరసింహస్వామి, ఆరవ తేదీన అన్నపూర్ణేశ్వరీ దేవి, ఏడవ తేదీన రంగనాయకుల స్వామి అలంకారం, 8వ తేదీన లలితా దేవి స్వామి, 9వ తేదీన వరాహ నరసింహస్వామి, పదవ తేదీన శ్రీ దుర్గా దేవి, 11వ తేదీన శ్రీకృష్ణ అలంకారము లతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈనెల 12వ తేదీన చివరి రోజున గ్రామసభ అలంకరణ ఉంటుందని తెలిపారు. కావున ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. (Story: లక్ష్మీ చెన్నకేశవ స్వామి శరణ్యవరాత్రుల వేడుకలు)