ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
న్యూస్ తెలుగు / ధర్మవరం ( శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తనిఖీ చేశారు. గోదాములకు, గదులకు వేసిన సీళ్లను తెరిపించి పరిశీలించారు. అనంతరం సీళ్లు వేయించారు. ఎన్నికల్లో వినియోగించనవి, రిజర్వులో ఉంచిన ఈవిఎంలను తరలించేందుకు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని ఆర్‌డిఓను కలెక్టర్ ఆదేశించారు. ఈవిఎం గోదాముల ప్రక్కన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో వెంకటశివరామి రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ సురేష్, కలెక్టరేట్ ఎన్నికల విభాగపు డిప్యూటీ ఎమ్మార్వో మైనావుద్దీన్, టిడిపి, సిపిఐ, సిపిఎం, బిజెపి, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్)