జాతీయస్థాయి పోటీలలో ధర్మవరం విద్యార్థిని సత్త
బరిలో దిగితే మెడల్ సాధించడమే లక్ష్యం ..
ఎంఈఓలు-గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : జాతీయస్థాయి పోటీలలో ధర్మవరం విద్యార్థిని సత్తాబరిలో దిగితే మెడల్ సాధించడమే లక్ష్యం అవుతుందని మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల వి ఎన్ కే ఇండోర్ స్టేడియం తిరుసూర్ కేరళ లో కండెక్ట్ చేసిన జాతీయస్థాయి జూడో కేలో ఇండియా ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్లో సౌత్ ఇండియా చెన్నైలో ఈనెల 12,13, 14 తేదీల్లో జరిగిన జూడో సెలక్షన్స్ లో ధర్మవరం జూడో క్లబ్ కొత్తపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న కురుబ గవ్వల యువ సంధ్యా గోల్డ్ మెడల్ సాధించి, నేషనల్ లో కేరళలో 22, 23, 24 తేదీలలో జూడో కే లో ఇండియా ఉమెన్స్ నేషనల్ వీ ఎన్ కె ఇండోర్ స్టేడియం లో తిరుసూర్ కేరళ లో విద్యార్థిని మైనస్ 28 కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి మన ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గర్వకారణంగా మెడల్ సాధించడం, మన సత్యసాయి జిల్లా, ధర్మవరం కు మంచి గుర్తింపు రావడం జరిగిందని తెలిపారు. తదుపరి కొత్తపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో నుంచి కొత్తపేట సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పిల్లలతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈ ఓ రాజేశ్వరి మేడం తో పాటు ఎంఈఓ గోపాల్ నాయక్ సర్ స్కూల్ హెచ్ఎం మేరీ వర కుమారి మేడం తో పాటు స్కూల్ ఉపాధ్యాయ బృందం పిల్లల తల్లితండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని పిల్లలను ఎంఈఓ లు ఆశీర్వదించారు. కృషి పట్టుదల ఉంటే నేటి సమాజంలో దేనినైనను విజయవంతం చేయవచ్చునని జూడో క్లబ్ కోచ్ ఇనాయత్ బాషా తెలియజేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, వాళ్ళ లక్ష్యం ఒలంపిక్స్ మెడల్ సాధించేవరకు పోరాడు వలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మేరీ వర కుమారి తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : జాతీయస్థాయి పోటీలలో ధర్మవరం విద్యార్థిని సత్త )