Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘ‌నంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు 

ఘ‌నంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు 

0

ఘ‌నంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు 

 జాషువా రచనలు ఘనమైనవి

మాదిగ ఉద్యోగుల సమైక్య 

న్యూస్‌తెలుగు/వినుకొండ పట్టణం: వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో గుర్రం జాషువా 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఏబీఎన్ చర్చి కాంపౌండ్ దగ్గర ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి మాట్లాడుతూ మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. జాషువా చదువుకునే రోజుల్లోనే కష్టాలు మొదలయ్యాయని,ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నుండి ఎన్నో అవమానాలు పడ్డారు. సినిమా వాచకుడిగా పనిచేస్తూ టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా సంభాషణలను చదివేవారని, తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసి మంచి పేరు సంపాదించుకోని అంచెలు.. అంచెలుగా ఎదిగారన్నారు. కాక ని అప్పారావు మాట్లాడుతూ
తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా అని కొనియాడారు. అభి కలాం ఫౌండేషన్ అధ్యక్షురాలు నాగవాణి మాట్లాడుతూ అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం కృషి చేశారన్నారు. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలు అందించిన కవి జాషువా, పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, కవికోకిల కేంద్ర సాహిత్య అకాడమీ, పురస్కార గ్రహీత, నవయుగ కవి చక్రవర్తి ఇలా అనేక బిరుదులు వారి సొంతం చేసుకున్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు.. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువా 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన వైద్య మిత్ర కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ వ్యక్తి ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి రాష్ట్ర కార్యదర్శి కాకాని అప్పారావు అబ్దుల్ కలాం మరియు మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షురాలు సిహెచ్ నాగవాణి ఐ సి టి సి కౌన్సిలర్ సురేష్ చాట్ల రామయ్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఘ‌నంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version