మధ్యాహ్నం 12 కల్లా పెన్షన్లు పంపిణీ పూర్తిచేయాలి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : అక్టోబర్ 1 మధ్యాహ్నం 12గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 100శాతం పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం. సుభాష్ చంద్ర బోస్ ఉద్యోగులకు సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేసే ఉద్యోగులు వారి పరిధిలోని లబ్ధిదారులకు ముందు రోజే సమాచారం ఇచ్చి, 1వ తేదీనే పూర్తిగా పెన్షన్లు తీసుకునేలా చర్యలు గైకొనాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 100శాతం పెన్షన్లు పంపిణీ చేసి వినుకొండను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. సమావేశంలో మేనేజర్ వెంకటరావు, డి ఈ ఈ వెంకయ్య, నోడల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story : మధ్యాహ్నం 12 కల్లా పెన్షన్లు పంపిణీ పూర్తిచేయాలి)