7 నెలలుగా పెండింగ్ లో ఉన్న ధరణీ అపరెటర్ జీతాలను వెంటనే విడుదల చేయాలి
న్యూస్ తెలుగు/నేరేడు చర్ల : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహశీల్దార్ వారి కార్యాలయం నందు మరియు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయుటకై నియమించిన 671 ధరణి ఉద్యోగుల 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని శుక్రవారము ధరణి అపరెటర్ల సంఘం ఆధ్వర్యంలో నేరేడు చర్ల తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు . ఈ కార్యక్రమంలో ధరణీ ఆపరేటర్లు గణేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న ధరణీ అపరెటర్ జీతాలను వెంటనే విడుదల చేయాలి)