పేదల కోసం పెద్ద వార్తలు రాయాలి
దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర చైతన్య సభలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆఫ్ కాస్ట్ కుల నిర్మూలన అనే పుస్తకమే దళిత జర్నలిస్టులకు మార్గదర్శకత్వం: పాశం యాదగిరి
దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగ్గేదెలే: ఫోరం అధ్యక్షుడు కాశపోవు జాను.రాష్ట్ర ఉపా అధ్యక్షుడు ఈర్ల.సతీష్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : పేదల కోసం పెద్ద వార్తలు రాసి వెన్నుదన్నుగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర చైతన్య సభ సమావేశాలకు ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ప్రతి జర్నలిస్టు ఆత్మస్థైర్యంతో పనిచేస్తూ.. దళితుల సమస్యలపై తమ కళాలను ఎక్కుపెట్టాలని సూచించారు. దళిత జర్నలిస్టులపై తీవ్రమైన వివక్ష కొనసాగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన చైతన్యంతో ముందుకు సాగుతూ.. అనునిత్యం అన్యాయాలను ప్రశ్నిస్తూ తమ కాలాన్ని గలాన్ని ఎక్కుపెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికీ దళిత జర్నలిస్టులకు అక్రిడేషన్ లతోపాటు ఇండ్ల స్థలాలు హెల్త్ కార్డులు అందలేదని ఆయన అన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. వార్తల్లో చూడాల్సింది వాస్తవమని కులం కాదని కులవివక్షతను నిరంతరం నిర్మూలించేందుకు పోరాడాలని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆఫ్ కాస్ట్ కుల నిర్మూలన అనే పుస్తకమే దళిత జర్నలిస్టులకు మార్గదర్శకత్వం కావాలని ఆయన ఆకాంక్షించారు. దళిత జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్… దళిత జర్నలిస్టుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తగ్గేదేలే అని తెలిపారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కళాకారుల ఆటపాటలను ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులకు శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత కోరల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల. సతీష్ కుమార్. కొమరం భీం జిల్లా అధ్యక్షుడు రతన్ కుమార్.పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున దళిత జర్నలిస్టులు తరలివచ్చి సభను విజయవంతం చేశారు.(Story:పేదల కోసం పెద్ద వార్తలు రాయాలి)