Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రతీ విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

ప్రతీ విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

0

ప్రతీ విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

ప్రధానోపాధ్యాయులు ఉమాపతి

న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్సు సంబరాల్లో బాగంగా ప్రతీ విద్యార్థి మూఢనమ్మకాలను వదిలేసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు.
కాంతి వేగంతో పోటీ పడే రాకెట్లను అంతరిక్షంలోకి పంపగాలుగుతున్నాము అని,
గురితప్పకుండా వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేదించగల జలాంతర్గామల్ని సైన్సు ద్వారా కనిపెట్టినప్పటికీ మూడనమ్మకాలు మాత్రము పెరిగిప్తున్నాయన్నారు.
దేశపురోగమనానికి , మనిషి జీవన సౌలభ్యానికి శాస్త్ర సాంకేతికరంగాలు అతి కీలకమైనవని, గ్రహించిన మన మొదటితరం పాలకులు శాస్త్ర విజ్ఞానాన్ని విస్తరింప చేయాలనీ, పౌరుల్లొ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని భావించి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 హెచ్ లో పొందుపరిచారన్నారు. టీవీ సీరియళ్లు, సినిమాలు యూట్యూబ్ లు ప్రజల్లో మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ, సమాజాన్ని అజ్ఞానం వైపు తీసుకుపోతున్నారన్నారు. అందుకే ప్రతీ విద్యార్ధి ప్రశ్నించే తత్వాన్ని అలవారుచుకున్నప్పుడే మూఢనమ్మకాలకు దూరంగా వుంటారన్నారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ ఆధునిక సమాజాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలు లేకుండా ఊహించలేమన్నారు, ఆధునిక మానవాభివృద్ధికి దినదినాభివృద్ధి చెందుతున్న శాస్త్ర పరిజ్ఞానమే మూలమన్నారు. అందుకే ఎంతో ముందు చూపుతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజల్లో పెంపొందించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక పెడధోరనులు,అశాస్త్రీయ పోకడలు చోటు చేసుకుంటున్నాయన్నారు.రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటామని ప్రమాణం చేసిన వాళ్లే దానికి తూట్లు పొడుస్తున్నారన్నారు, విద్య వైద్యం తోపాటు అన్ని రంగాల్లోనూ అశాస్త్రీయ భావాలను చొప్పిస్తూ అభివృద్ధి చెందిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అపహాస్యం చేస్తూ చాందసవాదానికి బలం చేకూరుస్తున్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా పాలకవర్గాలు అనుసరిస్తున్నాయన్నారు.
ఉన్నత విద్యారంగంలో శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించినప్పుడే కొత్త ఆవిష్కరణలకు అవకాశము వుంటుందన్నారు, దానికి అనుగుణంగా శాస్త్ర పరిశోధనలకు అవసరమైన నిధులను కేటాయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు బిల్లే భాస్కరయ్య, రామకృష్ణ నాయక్, హరిశంకర్,గోవిందు, ఉపాధ్యాయినిలు లావణ్య, శివరత్న, పార్వతమ్మ, సుజాత, శ్రీలత , విధ్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రతీ విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version