పాలమూరు ఎండబెట్టారు, కాళేశ్వరం పండబెట్టారు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాలమూరు ఎండబెట్టారు, కాళేశ్వరం పండబెట్టారుఅని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రుల ప్రాజెక్టుల సందర్శనపై మాట్లాడుతూ పాలమూరు కరువుకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. పాడిపంటల పాలమూరును పడావుపెట్టి 14 లక్షల మంది ప్రజలను వలసల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజక్టులను పెండింగ్ లో పెట్టి ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది కాంగ్రెస్ కాదా అని , కల్వకుర్తి ఎత్తిపోతల కింద కనీసం 4 టీఎంసీల రిజర్వాయర్లను కూడా నిర్మించకుండా ఆంధ్రాలో మాత్రం 400 టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్లను నిర్మించింది నిజం కాదా అని అన్నారు. ముందుచూపుతో పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించింది కేసీఆర్ అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్న ఊహ అయినా కాంగ్రెస్ నేతల మదిలో ఉందా కేసీఆర్ గారు తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వందల కేసులు వేయించి అడ్డుకున్న పాపం కాంగ్రెస్ పార్టీది కాదా అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 57 టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్లు నిర్మించి పెట్టినా 10 నెలలుగా పనులను నిలిపివేసి, టెండర్లు రద్దు చేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా అని విమర్శించారు. పది నెలల నుండి పాలమూరుకు చెందిన సీఎం గానీ, నీటిపారుదల శాఖ మంత్రి గానీ పాలమూరు వైపు కన్నెత్తి చూడలేదుఅని విమర్శించారు. ఉద్దండాపూర్ నుండి గ్రావిటీ ద్వారా కొడంగల్, నారాయణపేటకు సాగునీరు తరలించే అవకాశం ఉన్నా కేవలం సీఎం రేవంత్ భేషజాలకు పోయి కొత్త ఎత్తిపోతల పథకం మొదలుపెట్టారు
6 టీఎంసీల సామర్ద్యం ఉన్న జూరాల మీద అదనపు భారం మోపుతున్నారుఅని విమర్శించారు. అందుకే శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టారు, మంత్రుల పర్యటనతో పాలమూరుకు ఒరిగేది శూన్యంఅని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రశ్నలకు భయపడి హడావిడిగా పర్యటన పెట్టుకున్నారు
కానీ ఇక్కడ రైతులకు మేలు చేయాలన్న ఒక ప్రణాళిక గానీ, చిత్తశుద్ధి గానీ లేదుఅని విమర్శించారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన క్లియరెన్స్ లు, చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. (Story : పాలమూరు ఎండబెట్టారు, కాళేశ్వరం పండబెట్టారు)