రెడ్యూస్ రియూస్ రీసైకిల్‌పై అవగాహన
న్యూస్ తెలుగు/విజయవాడ: ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభమైన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా, రెడ్యూస్ రీసైకిల్‌పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు త్రిపుల్ ఆర్ విజ్ఞాన కేంద్రంలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. స్థానిక ఎంకే బేగ్ స్కూల్ విద్యార్థులు అజిత్‌సింగ్ నగర్ ఎక్స్‌ఎల్ ప్లాంట్‌లోని త్రిపుల్ ఆర్ విజ్ఞాన కేంద్రంలో రెడ్యూస్ రీసైకిల్‌పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వాహణతో పాటు మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో రెడ్యూస్ రీ యూస్ రీసైకిల్ అనే అంశాన్ని ఎలా పాటించాలన్న దానిపై వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు. విజ్ఞాన కేంద్రంలో ఉన్న రెడ్యూస్ రీసైకిల్ పద్ధతి ఎలా జరుగుతుంది, నగరంలో ఉన్న ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ జరుగుతున్న తీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్సెల్ ప్లాంట్‌లో ఫ్లవర్ వేస్ట్ మేనేజ్‌మెంట్, విండో కంపోస్టింగ్, వర్మి కంపోస్ట్, బయో మిథనేషన్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మ్యానేజ్‌మెంట్, మినీ సూయేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, మాట్రేస్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సీ అండ్ డీ వేస్ట్ రీసైకిలింగ్ యూనిట్ ద్వారా వచ్చే రీసైకిల్డ్ వస్తువులను విద్యార్థులకు చూపించి, వారు కూడా రెడ్యూస్, రీ యూస్, రీసైకిల్ ద్వారా వచ్చే వస్తువులనే ఉపయోగించాచేలా అవగాహన కల్పించారు. (Story: రెడ్యూస్ రియూస్ రీసైకిల్‌పై అవగాహన)