Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మరణించిన హెంగార్డు కుటుంబానికి ఇన్సూరెన్సు అందజేత

మరణించిన హెంగార్డు కుటుంబానికి ఇన్సూరెన్సు అందజేత

0

మరణించిన హెంగార్డు కుటుంబానికి ఇన్సూరెన్సు అందజేత

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/ విజయనగరం : మరణించిన హోంగార్డు కుటుంబానికి సేలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్సుగా ఏక్సిస్ బ్యాంకు మంజూరు చేసినరూ.38 లక్షల చెక్ ను హెూంగార్డు కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ
విజయనగరం. జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పనిచేసి ప్రమాదవసాత్తు మరణించిన హెూంగార్డు కుటుంబానికి ఏక్సిస్ బ్యాంకు సేలరీ ప్యాకేజ్ స్కీంలో భాగంగా మంజూరు చేసిన రూ.38 లక్షల చెక్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ సెప్టెంబరు 25న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – హెూంగార్డ్సు సంక్షేమంలో భాగంగా హెూంగార్డ్స్ వేతనాలను సేలరీ ప్యాకేజ్ స్కీంగా ఏక్సిన్ బ్యాంకు ఖాతాల్లో జమయ్యే విధంగా పోలీసు ఉన్నతాధికారులు గతంలో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ స్కీం ప్రకారం ఎవరైనా హెూంగార్డు ప్రమాదవసాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు ఏక్సిస్ బ్యాంకు కొంత మొత్తాన్ని ఇన్సూరెన్సుగా అందజేస్తుందన్నారు.విజయనగరం జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా పని చేస్తున్న జి. వెంకట సత్యం (హెచ్.జి. 338)కు జూలై10న ప్రమాదవసాత్తు విద్యుత్ ఘాతం తగిలి మరణించారు. మరణించిన హెూంగార్డు వెంకట సత్యం కుటుంబాన్ని ఆదుకొనేందుకుగాను ఏక్సిస్ బ్యాంకు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా, సేలరీ ప్యాకేజ్ స్కీంలో భాగంగా జి.వెంకట సత్యం కుటుంబానికి రూ.38 లక్షలను ఇన్సూరెన్సుగా ఏక్సిస్ బ్యాంకు అధికారులు మంజూరు చేసారన్నారు. ఏక్సిస్ బ్యాంకు మంజూరు చేసిన ఇన్సూరెన్సు చెక్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సెప్టెంబరు 25న జిల్లా పోలీసుకార్యాలయంలో మరణించిన వెంకట సత్యం సతీమణి పార్వతికి ఏక్సిస్ బ్యాంకు అధికారుల సమక్షంలో అందజేసారు. మంజూరైన మొత్తాన్ని దుర్వినియోగం చేయకుండా వినియోగించు కోవాలని, పిల్లల చదువు, పెండ్లిళ్ళకు కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. హెూంగార్డ్సు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వెంకట సత్యం సతీమణి పార్వతిని ఇప్పటికే హెూంగార్డుగా నియమించామని, వెల్ఫేర్, ఎక్సిగ్రేషియా, చేయూతగా రూ. 4,20,500/- లచెక్ ను కూడా అందించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఏక్సిన్ బ్యాంకు మేనేజరు విశ్వకళ్యాణ్, ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఏక్సిస్ బ్యాంకు ఉద్యోగి మనోజ్ మరియు హెూంగార్డు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (Story : మరణించిన హెంగార్డు కుటుంబానికి ఇన్సూరెన్సు అందజేత )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version