Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ను కలిసిన విద్యార్థి...

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ను కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు

0

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ను కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు..

న్యూస్ తెలుగు/వినుకొండ:- ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలి, అల చేసే వరకు వివిధ దశలలో వినతి పత్రాలు అందిస్తూ, నిరసనలు లు తెలియచేస్తూ ప్రభుత్వం చేత ఇచ్చినా హామీలు నిరవేరెవరకు విద్యార్థుల పక్షాన, పోరాడాలని,వారికి ఇచ్చిన హామీలు నెరవేరెవరుకు వివిధ దశలలో ఉద్యమాలు చేయాలి అని నిర్ణయించినట్లు,రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవికుమార్ తెలియజేసారు.కౌన్సిల్ సమావేశం ముగిశాక తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి వారికి వినతి పత్రాలు అందించటం జరిగింది అని తెలియజేసారు.రాష్ర్ట వ్యాప్తంగా పెండింగ్ లో వున్న ఫీజ్ రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని, అలాగే జనవరి నుంచి పెండింగ్ లో వున్న సంక్షేమ హాస్టల్ లో మెస్ బిల్లులు విడుదల చేయాలని, హాస్టల్ లో కనీస మౌలిక వసతులు కల్పించాలనిప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తిరిగి అమలు చేయాలి అని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ని, ఎమ్మెల్సీ షరీఫ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవికుమార్,ప్రభుత్వ కళాశాల విద్యార్థులు.తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని మరల తిరిగి ప్రవేశ పెట్టాలని, గత వైసిపి ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపివేసి ఎంతో మంది పేద ఇంటర్ విద్యార్థులను ఆకలితో అలమటించేలా చేసింది అని, జీవో నెంబర్ 77 ద్వారా పీజీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఆపివేసింది అని, అలాగే సంక్షేమ హాస్టల్ లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలం అయింది అని అప్పుడు మేము ఎన్నో ధర్నాలు,నిరసనలు,చేసి విధ్యర్ధులకోసం ఉద్యమిస్తునపుడు నారా లోకేష్ యువగళం పాదయత్రలో కలిసి అయినకు వినతి పత్రం అందించాము అని అయినా కూడా టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మరల తిరిగి ఆ పథకాన్ని ప్రారంభిస్తామని, హాస్టల్ లో వసతులు మెరుగు పరుస్తం అని, పీజీ విద్యార్థులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం వచ్చి 4 నెలలు పైనే అయింది అని ఇప్పటినుంచి అయినా వాటి మీద దృష్టి సారించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి మరొక్కసారి తీసుకువెళ్లాలి అని విన్నవించుకున్నారు, వారి సమస్యలు విన్న ఎమ్మెల్సీ షరీఫ్, వర్ల రామయ్య లు విద్యార్థుల సమస్యలను చంద్రబాబు, లోకేష్ లకు తెలియజేసి,త్వరలో సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తాం అని విద్యార్థులకు హామీ ఇచ్చారు.(Story:విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ను కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version