Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సాలూరు లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

సాలూరు లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

0

సాలూరు లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

న్యూస్ తెలుగు/ సాలూరు : రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించుకోవాలని సాలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ పండా తెలిపారు. బుధవారం సాలూరు మండలంలో మావుడి మరియు కందులపదం రైతు సేవా కేంద్రాల పరిదిలో వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దశపర్ని కషాయం & జిల్లేడు కషాయం తయారీ మరియు వాటి వినియోగం వల్ల కలిగే ఉపయోగాలు గురించి రైతులకు వివరించారు. అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ B. ఝాన్సీ అరటి,ఆయిల్ పామ్ & జీడి మామిడి లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. వెటర్నరీ డాక్టర్ కే ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఆవులు , గేదెలు మరియు గొర్రెలు పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు సబ్సిడిలో టార్పలిన్స్ మరియు స్ప్రేయర్లు , ట్రాక్టర్ అనుబంధ పరికరాలు సబ్సిడీలో కల్పించమని గ్రామ పెద్దలు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పెద్దలు, APCNF సిబ్బంది, గ్రామ వ్యవసాయ & ఉద్యాన సహాయుకులు , గ్రామ రైతులు పాల్గొన్నారు. (Story : సాలూరు లో పొలం పిలుస్తుంది కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version