హిందుస్థాన్ జింక్‌కు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్ ఇంపాక్ట్ అవార్డు
ముంబయి: దేశంలో అతిపెద్ద, ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమీకృత జింక్ ఉత్పత్తిదారు అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు సీఎస్‌ఆర్ ఇంపాక్ట్ అవార్డ్స్`2024లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. నీరు, పారిశుద్ధ్య ఆరోగ్యం (వాష్), క్రీడల ప్రమోషన్ కేటగిరీలతోపాటు సామాజిక సంక్షేమానికి విశేషమైన కృషి చేసినందుకు గుర్తింపుపొందింది. రాజస్థాన్‌లో నీటి కొరత, పారిశుద్ధ్యం వంటి క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడంలో హిందుస్థాన్ జింక్ మార్గదర్శక ప్రయత్నాలు చేసి వాష్ అవార్డును దక్కించుకుంది. ఉదయ్‌పూర్‌లో మొదటి, ఏకైక మురుగునీటి శుద్ధి కర్మాగారం, వివిధ రివర్స్ ఆస్మాసిస్ హబ్‌లు, దాదాపు 50 గ్రామాల్లో ఆర్‌ఓ ఏటిఎంలను స్థాపించడం ద్వారా స్థానిక కమ్యూనిటీలకు సులభతరమైన నీటి సరఫరాను అందుబాటులో ఉంచింది. మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడిరది. (Story : హిందుస్థాన్ జింక్‌కు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్ ఇంపాక్ట్ అవార్డు)