చిన్నారి మదిహా ఫిర్దౌస్ పుట్టినరోజున రక్తదానం
రజిని చారిటబుల్ ట్రస్ట్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గంలోని
బత్తలపల్లి మండలంలో గల ఆర్డిట్ హాస్పిటల్లో రాయదుర్గం కి చెందిన కావ్య ప్రియ అనే చిన్నారి తలసేమియా తో బాధపడుతూ రక్తం కావాలని సోషల్ మీడియా ద్వారా రజిని చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సభ్యులకి కన్నా వెంకటేష్ కి తెలిసిన వెంటనే స్పందించి ధర్మవరం నుంచి బత్తలపల్లి ఆడిట్ హాస్పిటల్ కి వెళ్లి తన ఓ , పాజిటివ్ రక్త దానం చేయండి జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నా వెంకటేష్ మాట్లాడుతూ మన రక్తదానం మరొకరి ప్రాణదానం అనే నిదానంతో ఈ రోజున మా మిత్రులు మహబూబ్ బాషా వారి కూతురు మదిహా ఫిర్దౌస్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అని తెలిపారు. ఇప్పటివరకు ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలు 25 , రక్తదానం 25 మొత్తం 50 ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం మరియు ప్రతి 15 రోజులు ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలు ఖచ్చితంగా వచ్చి రక్తదానం చేస్తాము అని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్టు సభ్యులు కన్నా వెంకటేష్ ,మదిహా ఫిర్దౌస్,మహబూబ్ బాషా,సుమియా, మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు (Story : చిన్నారి మదిహా ఫిర్దౌస్ పుట్టినరోజున రక్తదానం )