Homeసినిమాఓటీటీబిగ్‌బాస్‌ 8: కాంతార కొత్త చీఫ్‌కు కష్టకాలమే!

బిగ్‌బాస్‌ 8: కాంతార కొత్త చీఫ్‌కు కష్టకాలమే!

బిగ్‌బాస్‌ 8: కాంతార కొత్త చీఫ్‌కు కష్టకాలమే!

Bigg Boss 8: బిగ్‌బాస్‌ తెలుగు (Bigg Boss 8 Telugu)8వ సీజన్‌ అంత గొప్ప ఆసక్తికరంగా సాగడం లేదన్న విషయం అందరికీ తెల్సిందే. కాస్తాకూస్తో జోకులేసి నవ్వించేవాళ్లు ఎలిమినేట్‌ కావడం, హౌస్‌లో మిగిలిపోయిన వారంతా ఏడుపులబ్యాచ్‌కి చెందిన వారే కావడంతో సహజంగానే ప్రేక్షకులకు ఈసారి ఆసక్తి సన్నగిల్లింది. నాగార్జున (Nagarjuna Akkineni) శని, ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్లు మినహాయిస్తే, మిగిలిన రోజులు పెద్దగా ప్రేక్షకుల మనసులను చూరగొనడం లేదు. బిగ్‌బాస్‌ 8 సీజన్‌లో ఇప్పటికే నాల్గవ వారం వచ్చేసపింది. ఈసారి నామినేషన్లు పూర్తయ్యాయి. అందులో పృథ్వీ, నాగమణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణ, సోనియా, నబీల్‌, నైనిక ఈ నామినేషన్ల లిస్టులో ఉన్నారు. కాంతార చీఫ్‌గా ఉన్న అభయ్‌ నవీన్‌ (Abhay Naveen)ఆదివారం ఎలిమినేట్‌ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఎప్పటిలాగే ఆ పోస్టు కోసం బిగ్‌బాస్‌ పోటీ పెట్టాడు. ఆ పోటీ కూడా నామినేషన్ల తరహాలో సభ్యులు తిట్టిపోతలకు అనువైన వేదికగా మారింది. ఎలాగైతేనేం, ఒక అందమైన ఆడబొమ్మను కాంతార చీఫ్‌ ఎన్నుకున్నారు.
గత సీజన్లలో కెప్టెన్లు ఉండేవారు. ఈసారి వారి స్థానంలో చీఫ్‌లు వచ్చారు. బహుశా అందుకోనేమో…ఈ సీజన్‌ అంతా మరీ చీపుగా మారింది. కంటెస్టెంట్లు శక్తి, కాంతార క్లాన్స్‌ అనే పేర్లు మీద గ్రూపులుగా విభజించారు. శక్తి చీఫ్‌గా నిఖిల్‌ ఉండగా, కాంతార చీఫ్‌గా అభయ్‌ నవీన్‌ ఉండేవాడు. అభయ్‌ బిగ్‌బాస్‌ ఇగోకి బలిపశువై ఎలిమినేట్‌ కావడంతో ఆ పోస్టు కోసం ఇప్పుడు పోటీ పెట్టారు. నిఖిల్‌ తప్ప మిగిలిన 10 మంది ఫోటోలను స్టాండ్‌పై పెట్టారు. బజర్‌ మోగగానే అక్కడున్న సుత్తిని ఎవరైతే పట్టుకుంటారో వారు ఓ ఫోటోని పగలగొట్టి, పోటీ నుంచి సంబంధిత కంటెస్టెంట్‌ను తప్పించవచ్చు. ఆరంభంలో నిఖిల్‌ (Nikhil) ఊహించని విధంగా ఆదిత్య ఓం (Aditya Om)బొమ్మను పగలగొట్టి అతన్ని జీరో చేశాడు. రెండోసారి ఆదిత్య అనూహ్యంగా సుత్తిని చేజిక్కించుకున్నప్పటికీ, అతను దాన్ని ఉపయోగించకుండా సుత్తిని పృథ్వీకి ఇచ్చి కొట్టమన్నాడు. పృథ్వీ చూసిచూసి మణికంఠ బొమ్మను, సీత అందరూ ఊహించినట్లుగానే యష్మి బొమ్మను, సోనియా (Soniya)తనదైన శైలిలో నబీల్‌ బొమ్మను, ఇక నైనిక తన శత్రువు అయిన విష్ణుప్రియ బొమ్మను, రెండోసారి సుత్తిని చేజిక్కించుకున్న సీత అనూహ్యంగా సోనియా బొమ్మను పగలగొట్టారు. అలా చివరకు సీత, ప్రేరణ పోటీలో మిగిలారు. అయితే వారిద్దరిలో కాంతార క్లాన్‌ కొత్త చీఫ్‌గా కిరాక్‌ సీత ఎంపికైంది. సీత కచ్చితంగా గట్టి పోటీనిస్తుందని సభ్యులు అభిప్రాయపడటంతో ఆమె కొత్త క్లాన్‌కు చీఫ్‌ అయింది. నిజానికి సీత బిగ్‌బాస్‌ హౌస్‌ (Bigg Boss 8)లోకి వచ్చిన కొత్తలో బలమైన కంటెస్టెంట్‌ కాదని అందరికీ తెలుసు. కానీ ఆమె అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుతమైన ఆటతీరుతో రోజురోజుకీ తన పాయింట్లు మెరుగుపర్చుకుంటూ హౌస్‌లో మగాళ్లకు దీటుగా నిలబడిరది. ఈ వారం ఆమె చీఫ్‌గా అవతరించినందున ఆమె ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయిపోయింది. గత రెండు వారాలపాటు వీక్‌గా ఉన్న కాంతార క్లాన్‌ ఇప్పుడు సీత నాయకత్వంలో బలంగా ఉంటుందా లేక మరింత వీక్‌ అవుతుందా అన్నది వేచిచూడాల్సిందే. ఈ క్లాన్‌లోకి ఎవరు వెళ్తారన్నది బుధవారం తేలితే గానీ సీత (Kirrak Sita) క్లాన్‌ ఎంత బలంగా మారుతుందో చెప్పలేం. ఏదేమైనా, కొత్త చీఫ్‌తో కాంతార క్లాన్‌కు కష్టకాలమే ఉండవచ్చని భావించవచ్చు. (Story: బిగ్‌బాస్‌ 8: కాంతార కొత్త చీఫ్‌కు కష్టకాలమే!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!