జూడో టోర్నమెంట్లో సత్తా చాటిన ఆదిత్య స్కూల్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఇటీవల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్ స్టేట్ జూడో టోర్నమెంట్లో ధర్మవరం పట్టణానికి చెందిన ఆదిత్య స్కూల్ ఆరవ తరగతి చదువుతున్న ఏ అక్షయని మైనస్ 23 కేజీల విభాగంలో స్టేట్ మెడల్ సాధించడం జరిగిందని స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ నెల రెండవ మూడవ తేదీలలో గుజరాత్ లో జరిగే ఎస్జీఎఫ్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడా రంగాన్ని కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, అందుకే జూడో టోర్నమెంట్ లో స్టేట్ మెడల్ సాధించి నేషనల్ స్థాయికి రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఏపీ తరఫున అక్షయ ని ఎంపిక కావడం పట్ల కరెస్పాండెంట్ జనార్దన్ తో పాటు జూడో కోచ్ ఇనాయత్ భాషా, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : జూడో టోర్నమెంట్లో సత్తా చాటిన ఆదిత్య స్కూల్)