దేవీ నవరాత్రుల ఉత్సవానికి విరాళం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని ఎల్సికేపురం 26వ వార్డులో ప్రతి సంవత్సరము ప్రత్యేకంగా దేవి నవరాత్రుల ఉత్సవాలను పార్కింగ్ ఆవరణములో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దేవీ నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించాలని నిర్వాహకులు తలపెట్టారు. ఇందులో భాగంగా 26వ వార్డు టిడిపి సీనియర్ నాయకుడు టైలర్ గోపాల్, తన వంతుగా 15 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. విరాళం పట్ల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : దేవీ నవరాత్రుల ఉత్సవానికి విరాళం)