ధర్మవరంలో ఉద్రిక్తత వాతావరణం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరున్ని ధర్మవరం సబ్ జైల్లో కలవడానికి వెళుతున్న సందర్భంలో, కారు డ్రైవర్ సబ్ జైలు వద్ద కేతిరెడ్డిని పంపి, యూటర్న్ తీసుకుని వెళ్లేటప్పుడు, అటుగా వస్తున్న బిజెపి నాయకుల కారుకు తగలడంతో గొడవ వాతావరణం ఏర్పడింది. బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగాయి. దీంతో బిజెపి నాయకులు గుంపులు గుంపులుగా సబ్ జైలు వద్దకు చేరుకోవడంతో, ట్రాఫిక్కు గంటలపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు డిఎస్పి శ్రీనివాసులు అక్కడికి చేరుకొని, సర్దుబాటు చేసి పంపించారు. సమాచారం అందుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ధర్మవరంలో కేతిరెడ్డి నిజస్వరూపం బయటపడిందని తెలిపారు. కేతిరెడ్డి ఓటమితో మైండ్ బ్లాక్ అయి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లడం జరిగిందన్నారు. గతంలో చేసిన తప్పులకు ప్రజలు గుణపాఠం చెప్పిన బుద్ధి రాలేకపోవడం విడ్డూరమన్నారు. జైలు జీవితం గడపాలని కోరిక ఉంటే త్వరలోనే తీరుస్తామని తెలిపారు. ధర్మవరంలో గొడవలు కు ఉసిగొలిపితే సహించేది లేదని తెలిపారు. అంతేకాకుండా సత్య కుమార్ యాదవ్ తన ట్వి ట్ కూడా చేశారు. (Story : ధర్మవరంలో ఉద్రిక్తత వాతావరణం)