సైకిల్ తోనే ఆరోగ్యం లభిస్తుంది
ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్
న్యూ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : సైకిల్ తోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ధర్మవరం స్లైకింగ్ అండ్ వాకర్స్ క్లబ్ ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం అధిక సంఖ్యలో సైకిల్ తో విద్యార్థులు, యువకులు, వచ్చేంత సేవా సంస్థ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని సైకిల్ ని తొక్కి తమ నినాదాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్ఐ. వెంకటరాముడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు, డీసీవిసీ సభ్యులు మాట్లాడుతూ ఇంతకుముందు కూడా వాక్ ఏ థాన్ అని లాంగ్ వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అప్పుడు కూడా ఆ కార్యక్రమం విజయవంతం అయిందని తెలిపారు. ముందుంది మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆధునిక యుగములో కనుమరుగవుతున్న సైకిల్, మనిషి ఆరోగ్యం లో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు పేరుపేరునా నిర్వాహకులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఆర్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, డీసీబీసీ గౌరవాధ్యక్షులు గోరకాటి పెద్దారెడ్డి, అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, సభ్యులు సుజిత్ కిషోర్, ఓం ప్రసాద్, జబీబుల్లా, సురేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. (Story : సైకిల్ తోనే ఆరోగ్యం లభిస్తుంది)

