ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ త్రైమాసిక సమావేశం
న్యూస్‌తెలుగు/కొమరం భీం ,ఆసిఫాబాద్ జిల్లా : ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ త్రైమాసిక సమావేశాన్ని కాగజ్‌నగర్ మండలం ఈస్గాంలో అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్ నిర్వహించారు. పలు అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి అధ్యక్షులు మాట్లాడుతూ స్థానిక రుద్ర ఆసుపత్రిలో అసోసియేషన్ సభ్యులకు చికిత్సలో 50 % తగ్గింపు ఇస్తున్నారని, ఎక్స్ ఆర్మీ సభ్యులు మృతి చెందితే తక్షణ ఖర్చుల నిమిత్తం 10,000 రూ” కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
అసోసియేషన్ తాత్కాలిక హాల్ ను ఈస్గాంలో బికాస్ గరమి, అమిత్ బిస్వాస్, అమిత్ దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈనెల 18 న ఆదిలాబాద్ లో సైనిక్ బోర్డ్ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. (Story : ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ త్రైమాసిక సమావేశం)