డిగ్రీ కళాశాల గ్రంధాలయమునకు ర్యాకులు వితరణ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గల గ్రంథాలయమునకు ర్యాకుల కొరత ఉండడంతో, ఆ కళాశాలలో2021-23 సంవత్సరంలో విధులు నిర్వర్తించిన అధ్యాపకులు బోధనేతర సిబ్బంది కలసి, 28 వేల రూపాయలు విలువ చేసే ఏడు పెద్ద ఐరన్ ర్యాకులు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రంథాలయంలో పుస్తకాలను భద్రపరిచేందుకు ర్యాకు లేకపోవడంతో, గతంలో పనిచేసిన ఆధ్యాపకులు బోధనేతర సిబ్బంది విద్యార్థులలో పుస్తక పటనాభిలాషను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు కళాశాలకు సౌకర్యంగా ఈ ర్యాకులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తదుపరి ప్రిన్సిపాల్ అధ్యాపకులకు బోధనేతర సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలకు అన్ని రకాలుగా ఎంతోమంది దాతలు, కళాశాల సిబ్బంది అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడం, విరాళాలు ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ పేరుపేరునా వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : డిగ్రీ కళాశాల గ్రంధాలయమునకు ర్యాకులు వితరణ )