ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ జట్టులో ధర్మవరం క్రీడాకారులు..
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు చండీగఢ్ లో జరుగుతున్న 14 వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలలో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ఫజులుద్దీన్, శబరీష్ గౌడ్ ఎంపికయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు టీమ్ మేనేజర్ గా హాకీ సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రెటరీ ధర్మవరం కు చెందిన ఎస్ అరవింద్ గౌడ్ వ్యవహరించడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ బి. సూర్యప్రకాష్, సత్యసాయిజిల్లా అధ్యక్షులు బీ.వీ.శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్,వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర,ట్రెజరర్ అంజన్న,జాయింట్ సెక్రటరీ చందు, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్ , అమునుద్దీన్ ,కిరణ్, సత్యసాయి జిల్లా శాప్ హాకీ కోచ్ హస్సేన్ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. (Story ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ జట్టులో ధర్మవరం క్రీడాకారులు..)