ఘనంగా బుదాల సాగర్ బాబు పుట్టినరోజు వేడుకలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఘనంగా టిడిపి నాయకులు బుదాల సాగర్ బాబు పుట్టిన రోజు వేడుకలు శనివారం పట్టణం లో ఘనంగా జరిగాయి. ముందుగా శాసనసభ్యులు ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు కేక్ కట్ చేయించారు. ఆ తరువాత మిత్రులు,అనుచరులు, స్థానిక బస్టాండ్ సెంటర్ నందు భారీ కేక్ కట్ చేయించి, అనంతరం విఠంరాజు పల్లె లో వున్న విభిన్న ప్రతిభావంతులు యొక్క. బధిరుల పాఠశాల నందు నందు అన్నదానం ఏర్పాటు చేసి, అక్కడినుంచి గుమ్మడి వృద్ధాశ్రమం నందు అక్కడి వృద్ధులకు కూడా భోజనాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశం లో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. (Story : ఘనంగా బుదాల సాగర్ బాబు పుట్టినరోజు వేడుకలు)