వాడుక భాషను వెలుగులోకి తెచ్చిన గొప్ప నాయకుడు గురజాడ అప్పారావు.
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : వాడుక భాషను వెలుగులోకి తెచ్చిన గొప్ప నాయకుడు, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అని నినదించిన గొప్ప సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు అని ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ కార్యాలయంలో సిబ్బందితోపాటు వారు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు 162 వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం నిజంగా సంతోషంగా ఉందని తెలిపారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి స్ఫూర్తిని పొందాలని తెలిపారు. కన్యాశుల్కం బాల్య వివాహాలు సాంఘిక దురాచారాలను ఎదిరించి సమకాలిన పరిస్థితులను రచనలలో చూపిస్తూ ప్రజలలో అవగాహన కలిగించి ప్రయత్నం చేసిన మహోన్నత వ్యక్తి గురజాడ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : వాడుక భాషను వెలుగులోకి తెచ్చిన గొప్ప నాయకుడు గురజాడ అప్పారావు.)