22 నుంచి ఏపీ టెట్ హాల్ టిక్కెట్లు
న్యూస్ తెలుగు/అమరావతి : ఏపీ టెట్`2024 పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈనెల 22వ తేదీ నుంచి హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు చేసుకునేలా అవకాశం కల్పించింది. 20వ తేదీ నుంచి ఏపీ టెట్ హాల్ టిక్కెట్లను సిఎస్‌సి.ఎపి.గౌవ్.ఇన్.వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి ఏపీ టెట్ హాల్ టిక్కెట్లను csc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మాక్‌టెస్ట్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఈ నమూనా పరీక్షా పత్రాలను సాధన చేయవచ్చని వివరించారు. మాక్ టెస్ట్‌లను సాధన చేయడం ద్వారా ఆన్‌లైన్లో నిర్వహించే టెట్ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. టెట్ పరీక్షల్లో ఎలాంటి మార్పుల్లేవు. అభ్యర్థుల విన్నపాల మేరకు ఇప్పటికే ఒక విడతగా టెట్ పరీక్షలను వాయిదా వేశారు. అక్టోబరు 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లుగా టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్`1ఏ, 1బి, పేపర్`2ఏ, 2బి విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సెషన్`1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్`2లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ మాక్‌టెస్ట్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. ఈ పరీక్షలకు నాలుగు లక్షలకుపైగా అభ్యర్థులు భారీ స్థాయిలో దరఖాస్తు చేశారు. త్వరలో రాబోయే 16వేల డీఎస్సీ పోస్టుల ప్రకటనతో టెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారంతా వెయిటేజీ మార్కుల కోసం రాస్తున్నారు. కొత్తగా ఉపాధ్యాయ వృత్తి చివరి సంవత్సరం చదువుతున్న వారూ టెట్‌కు పెద్దఎత్తున దరఖాస్తు చేశారు. (Story : 22 నుంచి ఏపీ టెట్ హాల్ టిక్కెట్లు)