Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

న్యూస్‌తెలుగు/ వినుకొండ :స్థానిక ఎన్. ఎస్. పి. కాలనీ గ్రౌండ్ నందు వినుకొండ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 5:30 కు ప్రారంభం 7 గంటలకు సుప్రభాత సేవ ఎనిమిది గంటలకు విశ్వకర్మ పతాకావిష్కరణ 9 గంటలకు భగవాన్ విరాట్ విశ్వకర్మ పూజ కార్యక్రమం 10 గంటలకు పంచకుండాఆత్మక శ్రీ విశ్వకర్మ యజ్ఞం 12:30 నిమిషాలకు నివేదన మంగళహారతి మరియు విశ్వశాంతి యజ్ఞం నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక విశ్వకర్మ పూజలు నిర్వహించారు. అనంతరం మక్కెనను దుశ్యాలవలు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది గురువు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సృష్టికి మూలం అని పరమాత్మ విశ్వకర్మ 5 ముఖాలతో పది చేతులతో స్వయంభుగా అవతరించిన రూపం వీరిది దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు మహాభారతము ఈయనను వేయి కలలకు అధినేతగా అభివందించిందని అన్నారు. అనంతరం అన్నసంతర్పణ పూజలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాంజనేయరెడ్డి, డి.కొండచారి, రెడ్డి వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!