ప్రోగ్రాం పేరు : వారం. రోజుల ఆర్య వర్క్ శిక్షణ
ప్లేస్: SV నగర్ పెరుమాళ్ల పల్లి తిరుపతి రూరల్
వారం రోజుల ఆర్య వర్క్ పై శిక్షణ కార్యక్రమం
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,మహిళా అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్. డి.ఉమాదేవి ఆధ్వర్యంలో వారం రోజులు ఆర్య వర్క్ పైన శిక్షణా కార్యక్రమం 2024 సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు ఎస్వీ నగర్ పెరుమాలపల్లె గ్రామ మహిళలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్. డి ఉమాదేవి మాట్లాడుతూ ప్రస్తుతం ఎంతో ఆదరణ ఉన్న ఆర్య వర్క్ పైన ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం వల్ల వారు స్వయం ఉపాధి సాధించగలరని తెలియజేశారు, అంతేకాకుండా వారు ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా సమాజంలో, కుటుంబంలో వారి స్థితిగతులను మెరుగుపరచుకుంటారని ఆశించారు.
శిక్షణకు వచ్చిన మహిళలందరూ ఈ వారం రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా వారు సొంతంగా ఆర్య వర్క్ షాపులను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం పద్మ ఆర్య వర్క్ పైన మహిళలకు శిక్షణను ఇస్తారు. మహిళా అధ్యయన కేంద్ర ప్రాజెక్ట్ అసిస్టెంట్ డాక్టర్.ఎం. ఇంద్రాణి మరియు మహిళలు పాల్గొన్నారు. (Story : ప్రోగ్రాం పేరు : వారం. రోజుల ఆర్య వర్క్ శిక్షణ)