బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం ,రంగాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన రాములు, శేఖర్ల కుటుంబ సభ్యులను వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరి వద్ద వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చెరువులో పడి మృతి చెందిన 8వ తరగతి విద్యార్థి విశాల్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరమశించి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహకారం అందజేస్తామని కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తాను ఎల్లవేళల సహకరిస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. (Story : బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే)