Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 30న మినీ బ్యూటీ ఎక్స్ పో

30న మినీ బ్యూటీ ఎక్స్ పో

0

30న మినీ బ్యూటీ ఎక్స్ పో

– హాజరుకారున్న అంతర్జాతీయ హెయిర్ కట్స్ , బాలీవుడ్ మేకప్ – ఆర్టిస్టులు
– ఎస్ బి ఎం ఎస్ అకాడమీ, సైమా బ్యూటీ ఎక్స్ పో సంయుక్తంగా నిర్వహించనున్న భారీ కార్య‌క్ర‌మం
– వివ‌రాలు మీడియాకు వెల్ల‌డించిన సైమా బ్యూటీ ఎక్స్ పో ప్రతినిధి రాఘవీరెడ్డి

విజయవాడ : స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈనెల 30వ తేదీన మినీ బ్యూటీ ఎక్స్ ఫో నిర్వహించనున్నట్లు ఎస్బిఎంఎస్ అకాడమీ, సైమా ప్రతినిధి రాఘవీ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పటమట ఫన్ టైమ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ బ్యూటీ ఎక్స్ పోనీ ఎస్బిఎంఎస్ అకాడమీ, సైమా బ్యూటీ ఎక్స్ పో సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలో బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు జావిద్ హబీబ్, డాక్టర్ ఆమోద్ దోషి పాల్గొంటున్నారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కొనసాగే ఎక్స్పోలో ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ కట్స్ సెమినార్స్, ప్రాస్థటిక్ ,ఎస్ ఎఫ్ ఎక్స్, లోకల్ సెలబ్రిటీస్ మేకప్ సెమినార్స్ ఉంటాయన్నారు. సైమా (సౌత్ ఇండియా మేక్ ఓవర్ అవార్డ్స్ ) (గురూజీ, ద మాస్టర్, మామ్ – సూపర్ ఉమెన్ అవార్డులతో పాటు ఎక్స్పో అనంతరం ఫ్యాషన్ షో ని నిర్వహించనున్నామన్నారు.
ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ వాళ్ళతో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడం ఎస్ బి ఎం ఎస్ అకాడమీ మ‌రియు సైమా బ్యూటీ ఎక్స్ పో వారికే సాధ్యమ‌ని, అలాగే ప్రతి ఒక్కరికి ఇదొక సువర్ణావకాశ‌మ‌ని, ఇండస్ట్రీ పెద్దలను కూడా సన్మానం చేయడం జరుగుతుంద‌ని ఆంధ్ర ప్రదేశ్ నాయిని బ్రాహ్మణా సంగం అధ్యక్షుడు సూరి బాబు చెప్పారు.
అనంతరం బ్యూటీ ఎక్స్ పో పోస్టర్‌ను సంస్థ ప్రతినిధులు, పెద్దల సమక్షంలో విడుదల చేశారు. ఈ సమావేశంలో, లిల్లి (పాలకొల్లు), జ్యోతి (విజయవాడ),షహనా, ప్రణవి, రజియా, రుక్సానా, ఒంగోలు ఉదయ, సిరి, తదితరులు పాల్గొన్నారు. (Story: 30న మినీ బ్యూటీ ఎక్స్ పో)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version