వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా
పుణె: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్, డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని తమ మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల కోసం స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ట్రక్ డ్రైవర్ల ప్రతిభావంతులైన కుమార్తెలు, పై చదువులు చదివేందుకు తోడ్పడటం ద్వారా వారి జీవితాల్లో పరివర్తన తెచ్చే దిశగా ఈ ప్రాజెక్టు ద్వారా కొంత సహాయం అందించేందుకు మహీంద్రా కట్టుబడి ఉంది. ఎంపికైన అభ్యర్ధులకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు రూ. 10,000 స్కాలర్‌షిప్‌తో సత్కరించే ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా. 2014లో ప్రారంభమైన మహీంద్రా సార్థి అభియాన్ కింద ట్రక్ డ్రైవర్ల కమ్యూనిటీ శ్రేయస్సుకు తోడ్పడే దిశగా మహీంద్రా ట్రక్ అండ్ డివిజన్ చేస్తున్న కృషిలో ఇది మరొక మైలురాయి. (Story : వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా)