Home వార్తలు తెలంగాణ ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

0

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

న్యూస్ తెలుగు /ములుగు : జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణం లో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి, పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు.అనంతరం
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ములుగు కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలొ గట్టమ్మ జిల్లా మహిళా సమాఖ్య ములుగు జిల్లా ఆధ్వర్యంలోని 57 స్వయం సహాయక సంఘాలకు 5 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు మంత్రి సీతక్క చేతుల మీదుగా అందించారు.పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పి శభరిష్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి, పుర ప్రముఖులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version