జాతీయ జెండాను ఎగరవేసిన వసంత కుమారి
న్యూస్ తెలుగు /ములుగు : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయం ఆవరణలోమంగళవారం,గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వసంత కుమారి , స్టాటిస్టికల్ ఆఫీసర్ యం.రాజ్‌కుమార్ , సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ మేనేజర్ వి.శ్రీనివాస్, జీసీసీ మేనేజర్ జి.దేవు, డిప్యూటీ తహశీల్దార్ ఎ.అనిల్, పెసా కోఆర్డినేటర్ కె.ప్రభాకర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ శివ ప్రసాద్, అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వాగ్యా, స్పోర్ట్స్ ఆఫీసర్ శ్యామలత, ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్‌హెచ్‌ఎం మహేందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : జాతీయ జెండాను ఎగరవేసిన వసంత కుమారి)