మెరుగైన వైద్యం అందిస్తే మంచి గుర్తింపు వస్తుంది
ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్ యాదవ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రజలకు మంచి వైద్యం అందిస్తే, హాస్పిటలకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టపర్తి రోడ్డు లో విజయలక్ష్మి పిల్లల హాస్పిటల్ నూతన భవనానికి వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో వసతులను వారు పరిశీలించారు. చిన్నపిల్లలకు ఉండే వసతులు పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు వచ్చే ప్రతి వ్యాధికి తగిన నాణ్యమైన విద్యను అందించాలని వారు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగాలను ప్రేమతో కూడా పలకరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు . (Story : మెరుగైన వైద్యం అందిస్తే మంచి గుర్తింపు వస్తుంది)