Homeవార్తలుసామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ ఛానల్‌ సేవల విస్తరణ

సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ ఛానల్‌ సేవల విస్తరణ

సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ ఛానల్‌ సేవల విస్తరణ

గురుగ్రామ్‌: భారతదేశంలో సామ్‌సంగ్‌ బ్రాండ్‌ ఉచిత యాడ్‌-సపోర్టెడ్‌ స్ట్రీమింగ్‌ టీవీ (ఫాస్ట్‌) సర్వీస్‌ అయిన సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ తన పోర్ట్‌ఫోలియోలో నాలుగు కొత్త ఛానెల్‌లను ప్రారంభించడానికి ఇండియా టీవీ గ్రూప్‌తో జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇండియా టీవీ గ్రూప్‌ కనెక్టెడ్‌ టీవీ (సీటీవీ) ప్రత్యేక ఛానెల్‌లు ఇండియా టీవీ, ఇండియా టీవీ స్పీడ్‌ న్యూస్‌, ఇండియా టీవీ ఆప్‌ కి అదాలత్‌, ఇండియా టీవీ యోగా ఇప్పుడు సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. వీక్షకులు ఇప్పుడు వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌, ఫిట్‌నెస్‌, వినోదంలనుండి విస్తృతమైన అధిక నాణ్యత కంటెంట్‌ ఆఫర్‌లకు సులభంగా వీక్షించి ఆస్వాదించవచ్చు.
సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ అనేది సామ్‌సంగ్‌ స్మార్ట్‌ టీవీలలో ముందే ఇన్‌స్టాల్‌ చేయబడిన ఉచిత స్ట్రీమింగ్‌ సేవ. ఎంపిక చేసిన దేశాలలో వార్తలు, క్రీడలు, వినోదం, మరిన్నింటితో సహా అనేక రకాల ఛానెల్‌లను అందిస్తోంది. భారతదేశంలో, సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ వీక్షకులకు 100 కంటే ఎక్కువ లైవ్‌ టీవీ ఛానెల్‌లు, వేలకొద్దీ చలనచిత్రాలు, షోలకు లైవ్‌, ఆన్‌-డిమాండ్‌ రెండిరటికీ యాక్సెస్‌ కల్పిస్తోంది. (Story : సామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌ ఛానల్‌ సేవల విస్తరణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!