శ్యామలాంబ పండుగ పై సమీక్ష
న్యూస్‌తెలుగు/సాలూరు: సాలూరు గ్రామదేవత అయిన శ్యామలాంబ పండుగ నిర్వహణపై సాలూరు జమిందార్ విక్రమ చంద్ర సన్యాసి రాజు నివాసం లో పట్టణ ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర. శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, సీనియర్ నాయకులు జర్జాపు సూరిబాబు తోపాటు వివిధ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు హాజరయ్యారు.పదేళ్ళ తర్వాత నిర్వహిస్తున్న పండుగ తీరుతెన్నుల గురించి చర్చించారు.గతంలో పండుగ సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, అనుభవాలు దృష్టి లో పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది మే నెలలో శ్యామలాంబ పండుగ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.(Story:శ్యామలాంబ పండుగ పై సమీక్ష )