Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అంకాలమ్మ పోలేరమ్మ లకు పొంగళ్లు

అంకాలమ్మ పోలేరమ్మ లకు పొంగళ్లు

అంకాలమ్మ పోలేరమ్మ లకు పొంగళ్లు

న్యూస్‌తెలుగు/ వినుకొండ :  స్థానిక కుమ్మరి బజార్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళ భక్తులు అంకాలమ్మ పోలేరమ్మ లకు పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వినాయక చవితి 15వ వార్షికోత్సవంలో భాగంగా బొజ్జ గణపయ్యకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవంలో శుక్రవారం భాగంగా రాధాకృష్ణ కోలాటం బృందంతో కోలాట ప్రదర్శించేగా ఈ కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం మహిళా భక్తులచే పెద్ద ఎత్తున అంకాలమ్మ పోలేరమ్మలకు పొంగల్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పొంగళ్ల సమర్పణలో భాగంగా మహిళ భక్తులు గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తు ఆలయాలకు చేరుకున్నారు. లోక కళ్యాణార్థం అమ్మవార్లకు పొంగల్లు సమర్పించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. పొంగళ్ళు సమర్పించిన మహిళ భక్తులకు టిడిపి యువ నాయకులు యూనిట్ ఇన్చార్జి ఎస్.కె జానీ సాంప్రదాయంగా మహిళ భక్తుల లందరికీ చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాలింగ శ్రీనివాసరావు, ముప్పూరి చౌడమ్మ, బొంకూరి రోశయ్య, పారెళ్ళ మల్లికార్జున రావు, బొంకూరి కోటేశ్వరరావు, జీడిమల్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ యూత్ గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. (Story : అంకాలమ్మ పోలేరమ్మ లకు పొంగళ్లు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!