అత్యధిక డిమాండ్ ఉన్న టాప్`5 ఉద్యోగాలు ఇవే : ఇండీడ్
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: పండగ వాతావరణం ఒక్క వినియోగదారుల కార్యాచరణలో మాత్రమే కాకుండా అది వివిధ విభాగాలలో ఎదుగుదలని సూచిస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్టు తయారైనప్పటికీ కూడా నిర్దిష్ట ఉద్యోగాలు పోస్టింగ్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్స్‌తో పాటు ఉద్యోగాలను పొందుతున్నాయి. ఇండీడ్ ప్రకారం ఈ పండగ వాతావరణంలో వారి సరారరీ జీతల ఎదుగుదలతో పోలిస్తే క్రింది ఐదు ఉద్యోగాలు ఈ నగరాలలో అత్యధిక వేతనాన్ని అందిస్తున్నాయి. వాటిలో డెలివరీ ప్రతినిధులు, వేర్ హౌస్ పనివారు (పేకేజ్, లేబుల్ చేయుట, మరియు ఆర్డర్ ని పూర్తి చేసే సిబ్బంది), రవాణా సహచరులు, స్టోర్ లో ఉండే సేల్స్ ఏక్సిక్యూటివ్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. డెలివరీ ప్రతినిధుల పోస్టుల ఎదుగుదల 30% పెరిగిందని ఇండీడ్ పేర్కొంది. వీరి సరాసరి జీతం సంవత్సరానికి 2,47,159 రూపాయలు. అత్యధికంగా చెల్లించే నగరంగా హైదరాబాద్ నిలిచింది. అక్కడ సంవత్సరానికి 3,76,219 రూపాయలు వేతనం ఇస్తున్నారు. (Story : అత్యధిక డిమాండ్ ఉన్న టాప్`5 ఉద్యోగాలు ఇవే : ఇండీడ్)