24 కోట్ల రూపాయలతో JNTU నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి:వనపర్ లోని JNTU ఇంజనీరింగ్ కళాశాలకు త్వరలోనే నూతన భవనాల నిర్మాణాలను ప్రారంభిస్తామని, ప్రభుత్వం ఇట్టి నిర్మాణాలకు 24 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.గురువారం వనపర్తి పట్టణ శివారులోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసుకున్న గణనాధునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి లోని జేఎన్టీయూ కాలేజీలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తాను ఎల్లవేళలా సహకరిస్తారని ఎంఎల్ఏ పేర్కొన్నారు.విద్యార్థులు కళాశాలకు వచ్చిపోయేందుకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందువుతోందని తన దృష్టికి వచ్చిన వెంటనే ఆర్టిసి డిపో మేనేజర్ తో మాట్లాడి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీల రెడ్డి శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.(Story:24 కోట్ల రూపాయలతో JNTU నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం)