ధర్మవరం విద్యార్థులకు మహా వందన సర్టిఫికెట్లు పంపిణీ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఎన్జీవో హోం లో తెలుగు రెండు రాష్ట్రాలలో మహా న్యూస్ చేపట్టిన హర్గర్ స్థిరంగ్ మహా వందనం కార్యక్రమం యొక్క సర్టిఫికెట్లను నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ హరీష్ కుమార్, జింక రామాంజనేయులు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ చేతులమీదుగా అందజేశారు. అనంతరం హరీష్ కుమార్ మాట్లాడుతూ మహా న్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఆగస్టు 15 యొక్క కార్యక్రమాలను ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాల్గొని తమ సత్తా చాటడం జరిగిందని తెలిపారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించే విధంగా స్వాతంత్ర సమరయోధుల పోరాటం గూర్చి విద్యార్థుల్లో అవగాహనతో పాటు ఇటువంటి పోటీలు నిర్వహించి బహుమతులతో పాటు ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ అందజేయడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మహా న్యూస్ సిఎండి మారెళ్ళ వంశీని వారు అభినందించారు. మహా వందనం మంచి కార్యక్రమమని విద్యార్థులలో దేశభక్తి పెంపొందించే విధంగా వినూత్నంగా చేపట్టిన మహా న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలను తెలియజేశారు. నియోజకవర్గంలో మహా వందనం అనే కార్యక్రమంలో 70 మంది విద్యార్థులకు ఎంఈఓ.. రాజేశ్వరి దేవి తో పాటు బిజెపి ఇన్చార్జ్ తదితరులు బహుమతులను, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జింక రామాంజనేయులు, కొత్తకోట రవీంద్రారెడ్డి, జింక చంద్రశేఖర్, సాకే ఓబులేషు రిటైర్డ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏకుల చలపతి, ధర్మవరం కాకతీయ విద్యా నికేతన్ ,వంశీకృష్ణ నోబుల్ స్కూల్, యశోద కాన్సెప్ట్ స్కూల్, గాయత్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, బి ఎస్ ఆర్ మున్సిపల్ హై స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : ధర్మవరం విద్యార్థులకు మహా వందన సర్టిఫికెట్లు పంపిణీ)