పలు కుటుంబాలకు గుమ్మడి సంధ్యారాణి పరామర్శ
న్యూస్ తెలుగు/సాలూరు : ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలకు ఇంటికి వెళ్లే వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి బుధవారం పరామర్శించడం జరిగింది. కందులు పదంలో ఇందిరమ్మ గిరిజన మహిళ కరెంట్ షాక్ తో మృతి చెందడంతో ఆమె కుటుంబానికి వెళ్లి పరామర్శించి ప్రభుత్వాన్ని నుంచి ఆర్థిక సహాయం వచ్చేటట్లు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా మామిడి పిల్లి పిఎసిఎస్ సెక్రటరీ హరి నాగరాజు కుటుంబాన్ని కూడా పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సాలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాలతి దొర స్వర్గస్తులైన కారణంగా అక్కడకెళ్లి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి మాలతి దొర గారి మృతికి సంతాపం తెలియజేసారు. (Story : పలు కుటుంబాలకు గుమ్మడి సంధ్యారాణి పరామర్శ)

