బద్దెల శ్రీనివాసులు మృతి పట్ల సంతాపం తెలిపిన బిజెపి నాయకులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణ ప్రముఖులు బద్దెల శ్రీనివాసులు ఈ నెల 10వ తేదీన అకస్మాతగా మృతి చెందారు. ఈ సందర్భంగా పట్టణంలోని వారి ఇంటికి బిజెపి, ఎమ్మెల్యే, మంత్రి ముఖ్య అనుచరుడు హరీష్ బాబు, బిజెపి నాయకులు జిల్లా చంద్రశేఖర్ శివ సాకే ఓబులేసు తదితరులు వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కీర్తిశేషులు భద్ర శ్రీనివాసులు చేసిన సేవలను వారు కొనియాడారు. (Story : బద్దెల శ్రీనివాసులు మృతి పట్ల సంతాపం తెలిపిన బిజెపి నాయకులు)